KALVAKUNTLA KAVITHA NEW PARTY TRS
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ (BRS) అధినేత కె. చంద్రశేఖర్ రావు కుమార్తె, కల్వకుంట్ల కవిత శనివారం ఉదయం తన సొంత రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) అని, శనివారం ఉదయం కవిత ఈ పార్టీ పేరును అధికారికంగా వెల్లడించారు.
తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేయాలనే ఉద్దేశంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
గతంలో ఉన్న టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) పేరును పోలి ఉండేలా ‘తెలంగాణ రాష్ట్ర సేన’ అని పేరు పెట్టడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కొత్త పార్టీ స్థాపనతో రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది
Please tell us what is wrong. Your report will be sent to the website team.
