Mulugu Collector Hemanth Sahedevarao
Published:
Updated: 26 Apr 2026 • 12:21 PM
* ములుగు జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన భోర్కడే హేమంత్ సహదేవరావు
ఆకేరు న్యూస్ , న్యూస్ ములుగు :
ములుగు జిల్లా నూతన కలెక్టర్గా భోర్కడే హేమంత్ సహదేవరావు ఆదివారం జిల్లా కలెక్టరేట్లో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా సమగ్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలుకు ప్రాధాన్యతనిస్తామని తెలిపారు. జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేసి, ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏ ఓ రాజ్ కుమార్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
