ITDA Officer Lenin Toppo
* ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ గా లెనిన్ వాత్సల్ టోప్పో బాధ్యతల స్వీకరణ
ఆకేరు న్యూస్ ములుగు:
ములుగు జిల్లాలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ అభివృద్ధి సంస్థ (ఐటిడిఏ) ఏటూర్ నాగారం ప్రాజెక్ట్ ఆఫీసర్ గా లెనిన్ వాత్సల్ టోప్పో ఆదివారం బాధ్యతలు చేపట్టారు.
బాధ్యతలు చేపట్టిన అనంతరం కార్యాలయాన్ని తనిఖీ చేసి, గిరిజన సంక్షేమ కార్యక్రమాల అమలుపై ఐటీడీఏ యూనిట్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ కె. నాగరావు, స్టాటిస్టికల్/అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎం. రాజ్‌కుమార్, ఆఫీస్ మేనేజర్ వి. శ్రీనివాస్, అకౌంట్స్ మేనేజర్ కె. నర్సింగ్, పిసా కోఆర్డినేటర్ కె. ప్రభాకర్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
