Mulugu SP village visit
కర్రె గుట్టలలోని జల్ల, డోలీ గ్రామాలను సందర్శించిన ములుగు జిల్లా ఎస్పీ
ఆకేరు న్యూస్ ములుగు:
తెలంగాణ చతిష్ ఘడ్ రాష్ట్రాల సరిహద్దులో గల ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని కర్రె గుట్టలలో ఉన్న జల్ల, డోలీ గ్రామాలను ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ పోలీస్ అధికారుల బృందంతో కలిసి ఆదివారం సందర్శించారు.
మురుమూరు నుండి పామునూరు, జల్ల, డోలీ మీదుగా తాడపాల వరకు నిర్మాణంలో ఉన్న రహదారి పనులను పరిశీలించారు. రహదారి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, అలాగే పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పకుండా పాటించాలని సంబంధిత కాంట్రాక్టర్ను ఆదేశించారు.
రహదారి నిర్మాణ పనుల నిమిత్తం రాత్రింబవళ్లు కష్టపడి బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ములుగు డీఎస్పీ రవీందర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ శంకర్, వెంకటాపురం సీఐ రమేష్, సివిల్ సీఆర్పీఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
