paddy procurement issues CPM
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
ధాన్యం సేకరణ, కొనుగోలు ప్రక్రియలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యాన్ని విడనాడి రైతుల సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని సిపిఎం చిల్పూర్ మండల కమిటీ డిమాండ్ చేసింది. జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని ఐకేపి, పిఎసిఎస్ కొనుగోలు కేంద్రాలను మంగళవారం సిపిఎం బృందం సందర్శించింది.
ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి సాదం రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ఆన్లైన్ విధానం, గ్రేడింగ్ సమస్యలు
ధాన్య సేకరణలో ఆన్లైన్ సిస్టమ్‌ను వెంటనే రద్దు చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో ధాన్యాన్ని పరిశీలించి గ్రేడ్ నిర్ణయించాల్సిన అధికారులు, కేంద్రాల్లో ఉండకుండా ఎక్కడో ఉండి పర్మిషన్లు ఇస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల మిల్లులకు వెళ్ళిన తర్వాత తాలు, తేమ పేరుతో మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు అన్నారు.
మిల్లులలో నిల్వలు – కేంద్రం చొరవ చూపాలి.మీనాక్షి మిల్లులో సుమారు 55 వేల టన్నుల పాత ధాన్యం నిల్వ ఉంది. గత రెండు పంటలకు సంబంధించిన ఈ ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే బయటకు పంపేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మౌలిక సదుపాయాల లేమి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కనీస తాగునీరు, నీడ సౌకర్యం లేదని ఆరోపించారు. తతాలు పట్టే మిషన్లు సరిగా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదనపు వసూళ్లు – బోనస్ చెల్లింపు
మిల్లుల వద్ద రైతుల నుండి వసూలు చేస్తున్న అదనపు దిగుమతి చార్జీలను వెంటనే నిలిపివేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా దొడ్డు మరియు సన్న రకం వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ వెంటనే చెల్లించాలి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆవుల ప్రభాకర్, అపారదాపు రాజు, కర్రె నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
