SSC Results School Toppers
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
గత నెలలో జరిగిన పదవ తరగతి వార్షిక పలితాలు నేడు విడుదల కాగా స్టేషన్ ఘన్ పూర్ మండలంలో రెండు పాఠశాలలు 570 మార్కులతో ప్రథమ స్థానంలో నిలవగా మరో రెండు పాఠశాలలు 561 మార్కులతో రెండవ స్థానంలో నిలిచాయి. మొత్తం 22 పాఠశాలల నుండి 956 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 934 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అందులో పి. మనశ్విని 570 మార్కులతో (ఓయాసిస్ హై స్కూల్), జి.లావణ్య 570 మార్కులతో (జ్యోతిరావు బాపులే బాలికల పాఠశాల) విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలువగా సాయి తేజస్వి 561 మార్కులతో (టిఎంఆర్ ఎస్), మతిన్ 561 మార్కులతో (టీఎం ఆర్ఎస్), 561 మార్కులతో అభినవ్ (జ్యోతిరావు బాపులే బాలుర పాఠశాల) ద్వితీయ స్థానంలో నిలిచారు.
* చిల్పూర్ మండలంలో
చిల్పూర్ మండలంలోని 11 స్కూల్ నుండి 278 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయగా అందులో 274 మంది ఉత్తీర్ణత సాధించారు. 558 మార్కులతో సహస్ర లక్ష్మి(జెడ్పి హై స్కూల్ చిల్పూర్) ప్రథమ స్థానంలో, ఎండి ఆస్మా 548 మార్కులతో (జడ్పీ హై స్కూల్ మల్కాపూర్) ద్వితీయ స్థానంలో నిలిచారు.
