False Allegations Woman Complaint
* నేనే ముందు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను
* మాది విజయవాడ కాదు.. వరంగల్లే ..
ఆకేరు న్యూస్, హనుమకొండ : కిలాడి లేడీ అని .. నాలుగు పెళ్ళిల్లు చేసుకున్నదని , బంగారం ఎత్తుకు పోయిందని నా మీద అన్యాయంగా ఆరోపణలు చేస్తూ పత్రికలు , చానళ్ళలో పెద్ద ఎత్తున కథనాలు వెలువడ్డాయి.. సమాజంలో తలెత్తుకుని కూడా తిరగలేని పరిస్థితి వచ్చిందని నిమిషకవి ఇందిర అనే మహిళ తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిర బుధవారం హనుమకొండ ఏకశిలా పార్క్‌లో భారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి నేదునూరి జ్యోతి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మండ సదాలక్ష్మీ లతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. గతంలో పెళ్ళయి కూతురు ఉండడం చట్ట బద్దంగా విడిపోవడం.. ఆ తర్వాత ఒక వ్యక్తి చేతిలో మోస పోవడం లాంటి విషయాలన్నీ కూడా నా భర్త కు అన్నీ తెలుసన్నారు.. పెళ్ళి సంబంధం కుదిర్చిన మ్యారోజ్ బ్యూరో కు అన్ని వివరాలు ముందే తెలియజేశామన్నారు..
* నా భర్త సమీప బందువే మ్యారోజ్ బ్యూరో నిర్వాహకురాలు
పెళ్ళి తర్వాత కొంత కాలం సాఫీగానే సంసా రం సాగింది.. మరో వైపు మా మామయ్య పెళ్ళి లో పెట్టిన బంగారం తిరిగి కావాలని , బ్యాంకులో పెట్టి వచ్చిన డబ్బులను వ్యవసాయ అవసరాలకోసం ఉపయోగిస్తామని ఒత్తిడి తెచ్చారు. మా ఇంటి సమీపంలో ఉండే వ్యక్తి ద్వారా ఆ బంగారాన్ని మా మామయ్యకు ఇచ్చేశానని ఇందిర తెలిపారు. ఈ విషయం పోలీస్ స్టేషన్లో సైతం వివరించానన్నారు. మ్యారేజ్ బ్యూరో నిర్వాహకురాలు నా భర్తకు సమీప బంధువు . స్వయానా చిన్నమ్మ ( పిన్నీ ) అవుతుంది. నా గురించి ,, నా కుటుంబ వివరాలు అన్నీ తెలుసుకున్న తర్వాతనే పెళ్ళి సంబంధం కుదిర్చారన్నారు. తమ కులంలో అమ్మాయిలు దొరకడం లేదు కాబట్టే .. మీ కులంలో వాళ్ళను పెళ్ళి చేసుకుంటున్నామని మ్యారేజ్ బ్యూరో నిర్వాహకురాలు చెప్పిందన్నారు. అన్నిటికి మించి నా వైపు నుంచి కుటుంబ పెద్దలు ఎవ్వరు లేక పోవడంతో నా భర్త సమీప బంధువులైన దంపతులు నన్ను దత్తత తీసుకుని మరీ కన్యాదానం చేశారన్నారు.. నా గురించి ఏమి తెలియకుండానే.. తెలుసుకోకుండానే ఇవ్వన్నీ చేశారని ఏ విదంగా అనుకుంటారని ఆమె ప్రశ్నించారు.. నాకు చట్టబద్దంగా విడాకులు అయినాయి.. ఆ తర్వాత ఒక వ్యక్తి మోసం చేస్తే కేసు నమోదు చేశాను.. ఇప్పటికీ కేసు న్యాయ స్థానంలో ఉంది.. ఇక నేను ఇందులో దాచి పెట్టే అవకాశం ఏముంది.. ఏ విదంగా దాచి పెట్టగలను అని ఆమె అన్నారు.
* నేనే ముందు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను
నా భర్త హైదరాబాద్‌కు వెళ్లి వెంటనే వస్తానని హనుమకొండలోని నా ఇంటి నుంచి వెళ్లాడు. ఆ తర్వాత నా ఫోన్‌కు రెస్పాండ్ కాక పోవడంతో నేను హనుమకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళితే మరుసటి రోజు రమ్మన్నారు. తిరిగి పోలీస్ స్టేషన్‌కు వెళ్ళడంతో ఫిర్యాదు తీసుకుని రశీదు ఇచ్చారు.. మా భర్తకు.. మీ మీద ఫిర్యాదు వచ్చింది పోలీస్ స్టేషన్‌కు రావాలని పోలీస్ లు ఫోన్ చేశారు. హైదరాబాద్ లో ఉన్నాను రేపు వస్తానని ఆయన సమాధాన మిచ్చారు. కాని అదే రోజు పర్వతగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం ఆ వెంటనే కేసు నమోదు కావడం కూడా జరిగింది. నేను ఇచ్చిన ఫిర్యాదు చేయకుండా నా భర్త ఇచ్చిన ఫిర్యాదు మీద పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం నాకు ఆందోళన కలిగించింది. ఇదేంటని అడిగితే పోలీసుల నుంచి సమాధానం రాలేదు.
* కిలాడి లేడని మీడియాలో కథనాలు
నేను చేయని నేరానికి నన్ను బాధ్యులను చేస్తూ అత్యంత దారుణంగా నా పై కథనాలు వచ్చాయి. సమాజం , కుటుంబం అండగా లేని మా లాంటి వాళ్ళకు మీడియానే పెద్ద దిక్కుగా ఉంటుందని భావిస్తాం.. కాని మీడియా కనీస వాస్తవాలను తెలుసుకోకుండా నా మీద తప్పుడు కథనాలు ప్రచురించారు.. ఇంకా నాది విజయవాడ అని నేను వరుసగా పెళ్ల్ళిల్లు చేసుకుంటున్నానని , బంగారం ఎత్తుకెళ్ళానని తప్పుడు వార్తలు ప్రసారం చేశారు. నేను ఇప్పటి వరకు కనీసం విజయవాడ చూసి ఎరుగను .. మాది కొత్తగూడెం.. మా అమ్మగారి ఊరు కూడా స్టేషన్ ఘన్ పూర్ మండలంలోని ఉప్పుగల్లు గ్రామం అని వివరించారు. కనీసం నా వివరణ కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ఇప్పటికే ప్రచురించిన , ప్రసారం చేసిన వీడియో క్లిప్పింగ్‌లు యూట్యూబ్‌ల్లో కనిపిస్తున్నాయి. వెంటనే వాటిని తొలగించాలని మీడియా ను వేడుకుంటున్నానని ఇందిర చెప్పారు.
* బాధితురాలికి మీడియా అండగా నిలవాలి..
– నేదునూరి జ్యోతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
భారత జాతీయ మహిళా సమాఖ్య
బాధితురాలైన నిమిషకవి ఇందిర కు మీడియా అండగా నిలవాలి. గతంలో ఇందిరను మోసం చేసిన వారే తప్పుడు ప్రచారం చేశారు. ఇందిర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకుండా కేవలం రశీదు ఇచ్చి పంపించారు. ఇందిరకు ఉదయం రశీదు ఇచ్చి కేసు నమోదు చేయకుండా పంపించారు. ఆ మె భర్త మాత్రం మద్యాహ్నం పిర్యాదు ఇవ్వగానే పోలీసులు ఇందిర పై కేసు నమోదు చేశారు. ఇదేమన్యాయం .. పోలీస్ ఉన్నతాధికారులను కలిసి ఇందిర విషయంలో జరిగిన వాస్తవాలను వివరిస్తాం. ఇప్పటికైనా మీడియా మిత్రులు వాస్తవాలు తెలుసుకుని ఆమెకు జరిగిన అన్యాయాన్ని సరి చేయాలి.
* వాస్తవాలు తెలుసుకోకుండా కథనాలు వద్దు
మండ సదాలక్ష్మీ , రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్
భారత జాతీయ మహిళా సమాఖ్య
మీడియా ఎప్పుడూ ఆపదలో ఉన్న మహిళలకు అండగా నిలబడాలి. ఇందిర విషయంలో మాత్రం తప్పుడు సమాచారంతో కథనాలు చేశారు.. దీంతో ఆమె సమాజంలో కనబడే పరిస్థితి లేకుండా పోయింది. ఆమెను గతంలో మోసం చేసిన వారే కుట్ర పూరితంగా ఆమె పరువుకు భంగం కలిగించే విదంగా మీడియాను తప్పు దారి పట్టించారు. ఇప్పటికైనా ఇందిరకు న్యాయం జరిగే వరకు మీడియా అండగా నిలబడాలి. యూ ట్యూబుల్లో ఆమె పేరుతో ఉన్న వీడియోలను డిలిట్ చేయాలి..
————————————————————
