May Day celebrations Station Ghanpur
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ :
ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే ఉత్సవాలను జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్, చిల్పూర్ మండలాల్లో సిపిఐ, సిపిఎం పార్టీలతో పాటు హమాలీలు, ఆటో, ట్రాక్టర్ డ్రైవర్లు శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో సిపిఐ ఆధ్వర్యంలో చాగల్లు, శివునిపల్లిలో పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు ఎండీ యునుస్, మండల కార్యదర్శి సముద్రాల రాజు మండల సహాయ కార్యదర్శి జీడీ ఆశీర్వాదం, ఎండీ రహ్మతుల్లాహ్, తోట రమేష్, బూర్ల యాదగిరి, మహంకాళి నాగరాజు, పొన్న సాయిలు, హమాలీ యూనియన్ ప్రతినిధులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. చిల్పూర్ మండలం కేంద్రం సహా కృష్ణాజి గూడెం, లింగంపల్లి తదితర గ్రామాల్లో మండల శాఖ కార్యదర్శి సాదం రమేష్ ఆధ్వర్యంలో పంచ కార్మికుల దినోత్సవం జరుపుకున్నారు. స్టేషన్ ఘన్ పూర్ మండలం కేంద్రం, ఇప్పగూడెం, సముద్రాల, తాటికొండ తదితర గ్రామాల్లో మండల శాఖ కార్యదర్శి మునిగల రమేష్ శాఖ కార్యదర్శుల ఆధ్వర్యంలో ఎర్రజెండాలు ఎగురవేసి మేడే వేడుకలు జరుపుకున్నారు.

