KANA financial help priest family
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ :
ప్రమాదవశాత్తు తాటిపై నుండి పడి మృతి చెందిన పూజారి రమేష్ కుటుంబానికి కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ ఆమెరికా (కాన) ఆధ్వర్యంలో శనివారం రూ.20వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం చిన్నపెండ్యాలకి చెందిన పూజారి రమేష్ కుల వృత్తిలో భాగంగా గత నెలలో తాడిచెట్టు ఎక్కి దిగుతున్న క్రమంలో కాలుజారి తాటి చెట్టు పైనుండి పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తెలంగాణ గౌడ సంఘం జనగామ జిల్లా అధ్యక్షులు గడ్డం రాజు ద్వారా కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (కేఏఎన్ఏ) స్థానిక ప్రతినిదులు నాతి గణేష్, బాల్నే రామచంద్రుడు సహకారంతో గడ్డం రాజు, పిఎసిఎస్ మాజీ ఛైర్మెన్ గట్టు రమేష్, తెలంగాణ గౌడ సంఘం జిల్లా నాయకులు గట్టు రవి మృతుడి కుటుంబాన్ని పరామర్శించి అతని భార్య పూజారి కృష్ణవేణికి రూ. 20 వేల ఆర్ధిక సహాయం అందించారు.
కార్యక్రమంలో చిన్నపెండ్యాల గౌడ సంఘం అధ్యక్షుడు తాళ్లపల్లి వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ తాళ్లపల్లి సంతోష్, సంఘం పెద్దమనుషులు పూజరి రాజమోహన్, తాళ్లపల్లి రామ్ నారాయణ, తాళ్లపల్లి క్రాంతి కుమార్, తాళ్లపల్లి మొగిలి, గట్టు రవి, మాచర్ల లక్ష్మీనారాయణ, తాళ్ళపెల్లి రాజు, పూజారి చిన్న యాదగిరి, పూజారి యాదగిరి పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
