Shivaleela Judge Assumes Office
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ జూనియర్ సివిల్ జెడ్జ్, ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గా శివలీల బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకరణకు ముందు స్థానిక శ్రీ తిరుమల స్వామి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కనకం రమేష్, బార్ అసోసియేషన్ సభ్యులు జడ్జి శివలీలకు స్వాగతం పలికి శాలువతో సన్మానించారు.
ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కనకం రమేష్ మాట్లాడుతూ కోర్టుకి పూర్తిస్థాయి జడ్జి రావడం వల్ల కేసుల సత్వర పరిష్కారానికి అవకాశం లభిస్తుంది అన్నారు.
శాశ్వత జడ్జి రావడానికి సహకరించిన జనగామ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిభకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదుల ప్రధాన కార్యదర్శి మునిగాల రవీందర్, షన్మా కుమారి, అమరోజు శ్రీనివాస్, గుర్రపు బాబు మారపాక ప్రలక్ష్మణ్, శ్రీశైలం, తాడూరి వనిత, తాటికాయల అశోక్, గుర్రం అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
