Vijay TVK election results Tamil Nadu
* రాజకీయాల్లో మరోసారి రుజువైన దక్షిణాది సినిమా నటుల ప్రభావం
ఆకేరు న్యూస్ కమలాపూర్:
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) కనీవినీ ఎరుగని రీతిలో దూసుకుపోతోంది. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న ద్రావిడ దిగ్గజాలు DMK, AIADMKలను వెనక్కి నెట్టి, తొలి ప్రయత్నంలోనే TVK మ్యాజిక్ ఫిగర్ వైపు పరుగులు తీస్తుండటం భారత రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. 1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే అధికారాన్ని చేజిక్కించుకున్న నందమూరి తారక రామారావు సృష్టించిన చారిత్రాత్మక రికార్డును, నేడు విజయ్ తన అద్భుత ప్రదర్శనతో గుర్తుకు తెస్తున్నారు. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం TVK 110కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉండటంతో, ద్రావిడ కోటలో ఒక కొత్త శకం మొదలైందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అసాధారణ విజయం కేవలం తమిళనాడుకే పరిమితం కాకుండా, దక్షిణాది రాజకీయాల్లో సినిమా నటుల ప్రభావాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెబుతోంది.
* ఎన్టీఆర్ – విజయం ఒక ప్రభంజనం
రికార్డుల పరంగా చూస్తే, కేవలం 9 నెలల్లోనే పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఎన్టీఆర్ సాధించిన విజయం ఒక ప్రభంజనం , అన్-బ్రేకబుల్ (201/24) ఒక అద్భుతం. అయితే, తమిళనాట విజయ్ తమిళగ వెట్రి కజగం పార్టీని 2024 ఫిబ్రవరి 2న అధికారికంగా పార్టీని స్థాపించి, రెండేళ్ల తర్వాత ఈ విజయాన్ని అందుకోవడం ఒక నిశ్శబ్ద విప్లవంగా అభివర్ణించవచ్చు.
