* ఏకగ్రీవంగా ఎన్నిక
* కొండూరి రవీందర్ రావు రాజీనామాతో ఏర్పడ్డ ఖాళీ.
ఆకేరు న్యూస్ వరంగల్ : తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ ( టెస్కాబ్ ) నూతన చైర్మన్ గా మార్నేని రవీందర్ రావు (Marneni Ravinder Rao) ఎన్నికయ్యారు. హైదరాబాద్ అబిడ్స్ ( Hyderabad Abids) లోని ప్రధాన కార్యాలయంలో జరిగిన ఎన్నిక ప్రక్రియ లో వరంగల్ కు చెందిన మార్నేని రవీందర్ రావు టెస్కాబ్ చైర్మన్ ( TSCAB Chairman) గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రస్తుతం ఆయన వరంగల్ డీసీసీబి చైర్మన్ గా, టెస్కాబ్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. వైస్ చైర్మన్ గా హైదరాబాద్ డీసీసీబి (DCCB) చైర్మన్ కొత్త కురుమ సత్తయ్య నియమితులయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర సహకార సంఘాల రిజిస్ట్రార్ హరిత రవీందర్ రావు, సత్తయ్య (Sattaiah) లకు నియామక పత్రాలను అందజేశారు. ఇంతకుముందు ఉన్న చైర్మన్ కొండూరి రాజీనామాతో ఏర్పడ్డ ఖాళీ తో ఈ ఎన్నిక జరిగింది. రాష్ట్రంలో మొత్తం తొమ్మిది డీసీసీబి (DCC) బ్యాంకులు ఉన్నాయి. కాంగ్రెస్ అధికారం చేపట్టగానే చైర్మన్ గా ఉన్న ఏడుగురు సభ్యులు కాంగ్రెస్ లో చేరారు. ఇద్దరు చైర్మన్ లు మాత్రం బిఆర్ఎస్ ను వీడలేదు. దీంతో చైర్మన్ పదవిపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చారు. అవిశ్వాస తీర్మానంపై సోమవారం సమావేశం కానున్న నేపథ్యంలో కొండూరి రవీందర్ రావు, గొంగిడి మహేందర్ రెడ్డి రాజీనామా చేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ , డైరెక్టర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy), రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులను మర్యాదపూర్వకంగా కలిశారు.
మార్నేని రవీందర్ రావు రాజకీయ ప్రయాణం..
మార్నేని రవీందర్ రావు (Marneni Ravinder Rao) స్వస్థలం వరంగల్ జిల్లా అయినవోలు. ఆయన తండ్రి మాధవరావు స్వాతంత్ర సమరయోధుడు. ఆయన భార్య మధుమతి అయినవోలు ఎంపీపీ (MPP)గా ఉన్నారు. 1983 నుండి రాజకీయంల్లో క్రియాశీలకంగా ఉంటూ అనేక పదవులు చేపట్టారు. 1987లో అయినవోలు సింగిల్ విండో చైర్మన్ గా, మల్లికార్జున స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ గా వర్ధన్నపేట (Wardhannapet) మండలం నుంచి జెడ్పిటిసి (ZPTC) గా ఎన్నికై 2009 లో బిఆర్ఎస్ చేరారు. అదే సంవత్సరంలో డీసీసీ బ్యాంక్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు టేస్కాబ్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు.
——————–