Godadevi Sare Ceremony Jangaon
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం ఇప్పగూడెం శ్రీ వేణు గోపాలస్వామి దేవాలయంలో బుధవారం గోదాదేవికి చీరే…. సారె కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉదయం శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం లో పాలకుర్తి శైవక్షేత్ర వనిత శక్తి ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో ఘనంగా గోదా దేవికి చీరె….సారె కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో వనమాల రమ -వేణు, కొల్లూరి సంతోష -ఆనందం, ఇమ్మడి వీరమణి, వనమాల సునీత, నంగునూరి పద్మావతి, ఆరూరి రవీళా, ఆరూరి భార్గవి, ఆనంతుల దివ్యజ్యోతి పూజారులు రంగనాథ్, కృష్ణమాచార్యులు కమిటీ సభ్యులు జూలూకుంట్ల ప్రకాశరెడ్డి, దామెర వేణు, ఆరూరి జయప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు.
