Vijay Government Crisis Tamil Nadu
* మ్యాజిక్ ఫిగర్ లేదని గవర్నర్ తిరస్కారం
ఆకేరు న్యూస్, ప్రత్యేక ప్రతినిధి : తమిళ రాజకీయాల్లో ఊహించని పరిణమాలు జరుగుతున్నాయి. రేపు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సిన టీవీకే అధినేత విజయ్ కు అవకాశం దక్కలేదు. దీంతో రేపటి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని రద్దు చేశారు. బుధవారం తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ను విజయ్ కలిసి తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని కోరారు. 234 అసెంబ్లీ సీట్లకు గాను 118 సంఖ్యా బలం ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ తేల్చేసినట్లు గా చెబుతున్నారు. విజయ్ సారథ్యం వహిస్తున్న టీవీకే పార్టీ ఈ ఎన్నికల్లో మొత్తం 108 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రస్ పార్టీ ఐదు స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ విజయ్ కు మద్దతు ప్రకటించింది. దీంతో టీవీకే బలం 113 కి చేరింది. కాగా విజయ్ రెండు స్థానాల్లో విజయం సాధించడం వల్ల ఒక్క స్థానం గా మాత్రమే పరిగణలోనికి తీసుకుంటారు. దీని వల్ల టీవీకే బలం 112 గా మిగిలి పోయింది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే టీవీకే కు మరో ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. ప్రధాన పార్టీలతో పాటు వీసీకే -2 , ఐయూఎం ఎల్ -2 సీపీఐ -2 సీపీఎం -2, పీఎంకే -5 , బీజేపీ -01, డీఎండీకే – 1అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం 01 సీట్ల చొప్పున గెలిచాయి. ఐయూ ఎంల్ విజయ్ కు మద్దతు తెలిపేది లేదని స్పష్టం చేసింది. ఇక మిగిలిన పార్టీల్లో డీఎంకే కూటమిలో భాగస్వాములైన వీసీకే మద్దతు విషయంలో డోలాయమానంలో ఉంది. సీపీఐ, సీపీఎం లు కూడా అదే స్తాయిలో ఉన్నట్టు సమాచారం ..
* రంగంలోకి డీఎంకే- ఎఐడీఎంకే
మెజారిటీ సీట్లు సాధించిన సింగిల్ పార్టీగా విజయ్ పార్టీ టీవీకే అవతరించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ అందుకోలేక పోయింది. గవర్నర్ కూడా ప్రభుత్వం సానుకూలంగా లేక పోవడంతో తమిళనాడులో అనూహ్యంగా రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఈ ఎన్నికల్లో డీఎంకే 59 , ఏఐడీఎంకే 47 కలిస్తే వారి బలం 106 కు చేరుతుంది . డీఎంకే మిత్ర పక్షాలైనా పీఎంకే , వీసీకే , సీపీఐ, సీపీఎం, ఐయూఎంల్ లతో పాటు ఇతర చిన్న పార్టీలను కలుపుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం .. అదే జరిగితే తమిళ రాజకీయాల్లో పెను సంచలనాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది..?
——————————————–
