Dozer Grain Drying Innovation
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
వ్యవసాయ రంగంలో కూలీల కొరతను అధిగమించేందుకు రైతులు అనేక నూతన పద్ధతులను అవలంబిస్తున్నారు. ప్రస్తుతం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించిన రైతులు తేమ శాతాన్ని తగ్గించేందుకు ధాన్యాన్ని ఆరబెడుతుంటారు. ఇందుకోసం ధాన్యం తూకం వేసే వరకు ముగ్గురు నలుగురు కూలీలతో ప్రతిరోజు ధాన్యం నేర్పడం (ఆరబెట్టడం) తిరిగి రాసులుగా పోస్తుంటారు. దీనికోసం రైతు రూ.2 వేల నుండి రూ.3 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. దీనిని అధిగమించేందుకు జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం తాటికొండకు చెందిన నారదాస్ కుమార్ అనే రైతు కూలీలకు బదులుగా డోజర్ తో ధాన్యం నేర్పడం (ఆరబెట్టడం) కుప్పలుగా చేస్తున్నాడు. దీంతో ఖర్చు, సమయం ఆదా అవుతుందని రైతు తెలిపారు. ఇప్పటికే వరి నాటు యంత్రాలు, కోత యంత్రాలు రావడంతో దున్నడం మొదలుకొని వరి కోతల వరకు రైతులు సమయం, ఆర్థిక భారం తగ్గించుకునేందుకు విన్నుతున్న పద్ధతులు అవలంబిస్తున్నారు. అయితే కుమార్ అనే రైతు కొత్తగా ఆలోచించి డోజర్ తో వడ్లను నేర్పడం రూ.800 లతో పూర్తి కావడంతో సమయం ఆర్థిక భారం తగ్గుతుంది అన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
