NFDP Fishermen Registration Drive
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
మత్స్య కార్మికులందరూ నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ పోర్టల్ (NFDP) లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జనగాం జిల్లా చీఫ్ ప్రమోటర్ నీల రాజు కోరారు. స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోనీ రైతు వేదిక నందు జిల్లా నియోజకవర్గ స్థాయి మత్స్య కారుల అవగాహన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చీఫ్ ప్రమోటర్ మాట్లాడుతూ 99 రోజుల ప్రణాళిక ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలలో భాగంగా మత్సకారులకు నియోజకవర్గ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. జిల్లాలోని ప్రాథమిక, మహిళ మత్స పారిశ్రామిక సహకార సంఘాలు సభ్యుల అభివృద్ధి కొరకు నియోజకవర్గస్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని సొసైటీలలోని మహిళా మత్స్యకారులు అలాగే మత్స్య కార్మిక సంఘ సభ్యులు ఎన్ ఎఫ్ డి పి పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, అందులో రిజిస్ట్రేషన్ చేసుకోవడం వలన ప్రమాదం జరిగినచో ఇన్సూరెన్స్, ఇతరత్రా సబ్సిడీలు అందాలీ అంటే తప్పకుండా NFDP పోర్టల్ రిజిస్ట్రేషన్ కావాలని అన్నారు. చేపల ఉత్పత్తి, చెరువులలో కలుపు తొలగింపు చర్యలు చేపల వ్యాధులు వాటి నివారణ పద్ధతులు ప్రభుత్వ పథకాలు తదితర అంశాలను జిల్లా మత్స్యశాఖ అధికారి రానప్రతాప్ సింగ్ సవివరంగా వివరించడం జరిగిందని. కావున, ప్రతి ఒక్క మత్స్య కార్మిక సభ్యులు దానిని యధావిధిగా పాటించి రాష్ట్రస్థాయిలో జనగామ జిల్లా ముందు వరుసలో ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనగాం జిల్లా మత్స్య శాఖ అధికారి రానప్రతాప్, ఇరిగేషన్ అధికారులు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నీల రాజమ్మ – గట్టయ్య, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జనగాం జిల్లా డైరెక్టర్ భుర్ల శంకర్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ జనగాం జిల్లా అధ్యక్షులు నీల గట్టయ్య , ముదిరాజ్ మహాసభ రాష్ట్ర యువత కార్యదర్శి గోరంట్ల యాదగిరి, నియోజకవర్గ మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, వివిధ గ్రామాల మత్స్యకారులు, మహిళా మత్స్య కారులు తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
