Mulugu Badi Bata Programme
ఆకేరు న్యూస్,ములుగు:
ములుగు జిల్లా వ్యాప్తంగా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని గురువారం ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, సర్పంచులు ర్యాలీలు చేస్తూ ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని ఏటూర్ నాగారం, మంగపేట ,తాడ్వాయి, గోవిందరావుపేట, వెంకటాపురం ,వెంకటాపుర్, మల్లంపల్లి, వాజేడు కన్నాయి గూడెం తదితర మండలాల్లో, గ్రామాలలో బడిబాట కార్యక్రమాలు నిర్వహించారు. సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు ప్రజా ప్రతినిధు లు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలు వద్దు ప్రభుత్వ పాఠశాలలు ముద్దు అనే నినాదంతో గ్రామాలలో వీధుల వెంట నినాదాలు చేస్తూ చైతన్యవంతం చేశారు. ఈ ఏడాది పదవ తరగతి పరీక్షలలో ములుగు జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని దీనిని స్పూర్తిగా తీసుకొని పిల్లలందరినీ విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని అవగాహన కల్పించారు.అంతె కాకుండా ప్రభుత్వం విద్యాభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమ అభివృద్ధికి అనేక కార్యక్రమాలు, పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదని వివరించారు. ఈ కార్యక్రమాలలో ఆయా మండలాల విద్యాశాఖ అధికారులు, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లు,ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,సిఆర్పీలు, విద్యార్థిని ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
