AC Explosion in Summer Prevention Tips
* ఉత్తరం లేదా తూర్పు వైపు ఇన్ స్టాల్ చేయాలి
ఆకేరు న్యూస్ , హనుమకొండ : వేసవికాలం వచ్చిందంటే చాలు భానుడు భగభగ మండిపోతాడు. ప్రజలు మాత్రం చల్లని వాతావరణంలో ఉండడానికి ఇష్టపడుతుంటారు. ఏసీలు, ఫ్రిడ్జ్ లు ఎక్కువగా వినియోగిస్తూ సేద తీరుతుంటారు. ఈ వినియోగం వల్ల ఎలాంటి ఉపశమనం పొందుతారో, అదే విదంగా ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. అసలు ఏసీ ఎందుకు పేలుతాయి ..? కారణాలు ఏంటి అనే విషయాలను హనుమకొండ లోని క్రోమా సర్వీస్ సెంటర్ , యాజమాని మరియు టెక్నీషియన్ విజయ భాస్కర్ సలహాలు సూచనలు మీ కోసం…..
విజయ భాస్కర్. టెక్నీషియన్ గా గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. ఫ్రిడ్జ్ లు, ఏసీ లు, వాషింగ్ మెషిన్లు ఎలక్ట్రానిక్ పరికరాలకు సంబంధించిన హోమ్ అప్లైన్సెస్ అన్ని రిపేర్ చేస్తారు.
* ఏసీలు ఎందుకు పేలుతాయంటే
ఏసీ లు పేలడానికి ప్రధాన కారణాలు రెండే ఉన్నాయి . ఒకటి ఫస్ట్ ఏసీ రిపేర్ చేసేటప్పుడు గ్యాస్ చార్జింగ్ చేసే టైం లో మాత్రమే ప్రాపర్ ట్రైనింగ్ ఉన్న టెక్నీషియన్ చేస్తే ఆ ప్రాబ్లం రాదు. అవగాహన లేని టెక్నీషియన్లు గ్యాస్ చార్జింగ్ లాంటివి చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. దానికి కూడా ఒకటే ఒకటే కారణం ఉంటుంది . గ్యాస్ చార్జింగ్ చేసే ముందు దానికి ఎంత ప్రెజర్ ఉండాలి, గ్యాస్ ఎంత ఎక్కించాలి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది . ట్రైనింగ్ లేకుండా ఉండే టెక్నీషియన్లు గ్యాస్ చార్జింగ్ చేస్తే వాళ్ళు తెలవకుండా కూలింగ్ ఎక్కువ రావాలి అనే ఉద్దేశంతోటి గ్యాస్ ఎక్కువ ఎక్కిస్తారు. రెండో కారణం పవర్ ఫ్లక్చువేషన్.. ఇండోర్ గాని అవుట్ డోర్ గాని పిసిబి లు బర్న్ అయినప్పుడు, షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఇమిడియట్లీ ఏసీ ఆఫ్ చేయాలి. ఆఫ్ చేయకుండా ఉంటే ఏందంటే బోర్డు బర్న్ అయినప్పుడు క్యాబినెట్ మొత్తం ప్లాస్టిక్ కాబట్టి అంటుకుంటది. అంటుకున్నప్పుడు దాంట్లో కాపర్ పైప్స్ ఉంటాయి, కాపర్ పైపు ఓవర్ హీట్ అయినప్పుడు అందులో గ్యాస్ రన్ అయితా ఉంటుంది. ఓవర్ హీట్ అయినప్పుడు అది ఆటోమేటిక్ గా బ్లాస్ట్ అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో మాత్రమే ఏసీ లు పేలుతాయి.
* ఉత్తరం లేదా తూర్పు వైపు ఇన్ స్టాల్ చేయాలి
ఏసీ ఇన్స్టాల్ చేసినప్పుడు అవుట్ డోర్ యూనిట్ వచ్చేసి కంపెనీ నార్మ్స్ ప్రకారము ఉత్తరం లేదా తూర్పుకు అవుట్ డోర్ యూనిట్ ఉండాలి. ఎందుకంటే ఎండ వేడి తక్కువ ఉంటుంది. తూర్పు వైపు ఉదయం 11గంటల వరకే ఇంటి దగ్గర ఎండ ఉంటుంది, ఉత్తరానికి అసలు ఎండనే ఉండదు. అవుట్ డోర్ యూనిట్ ఏందంటే కార్ రేడియేటర్ లాగానే కంప్రెసర్ ఉంటది, కండెన్సర్ కాయిల్ ఉంటది ఓవర్ హీట్ అయితా ఉంటది. దక్షిణము, పడమర గనుక ఉందనుకోండి ఇప్పుడున్న టెంపరేచర్ కు అవుట్ డోర్ యూనిట్ వేడి అయితది. దాంతో పాటు అందులో ఉన్న ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ కూడా ఓవర్ హీట్ అయ్యి బర్న్ అవుతాయి . కాబట్టి వచ్చిన సర్వీస్ సెంటర్ ఏ కంపెనీ టెక్నీషియన్ కైనా కస్టమర్ సహకరించి వైర్ ఎక్కువ , కాపర్ పైప్ ఎక్కువయినప్పటికి డబ్బుల గురించి ఆలోచించ కుండా సేఫ్టీ గురించి మాతరమే ఆలోచించాలి. కాపర్ పైప్ ఎక్కువ పడుతుంది, డబ్బులు ఎక్కువవుతున్నాయని నాకు వద్దు, ఇటు వై పే ప్రొవిజన్ ఉంది టెక్నిషియన్ మాటను లక్ష్య పెట్టరు . .. అది సేఫ్టీ కాదు. ఎందుకంటే దక్షిణం వైపు పడమర వైపు ఎండ వల్లనే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి .
———————————
ALSO READ :
