Mulugu Collector Hemanth Rao medaram Sammakka Saralamma Darshanam
* సమ్మక్క సారలమ్మ వన దేవతల గద్దెలను దర్శించుకున్న.
జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవ్ రావు.
ఆకేరు న్యూస్, ములుగు:
ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ వన దేవతల గద్దెలను ములుగు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సోమవారం దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన కు గిరిజన సంస్కృతి సంప్రదాయాల ప్రకారం డోలు వాయిద్యాలతో ఆలయ పూజారులు, దేవాదాయశాఖ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆదివాసి ఆచార సంస్కృతి సంప్రదాయాల ప్రకారం వన దేవతలకు పసుపు కుంకుమ బంగారం (బెల్లం) సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు.అనంతరం సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మేడారం పూజారులు ,అధికారులు తదితరులు ఉన్నారు.
