Ram Charan Peddi Movie Story
* రామ్ చరణ్ కెరీర్లో మరో ‘రంగస్థలం’ అవుతుందా?
ఆకేరు న్యూస్, డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న భారీ చిత్రం పెద్ది (Peddi)ట్రైలర్ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో భారీ చర్చ మొదలైంది. దర్శకుడు బుచ్చి బాబు సానా (Buchi Babu Sana) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా. ట్రైలర్ మాత్రం సాధారణ కమర్షియల్ మూవీ కంటే చాలా డీప్ ఎమోషనల్ డ్రామాగా కనిపిస్తోంది.
* పల్లెటూరి బాలుడి నుంచి ఇండియా ప్రతినిధిగా…
ట్రైలర్‌ను బట్టి చూస్తే “పెద్ది” కథ ఓ గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకుడి జీవిత పోరాటం చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తోంది. కొండ ప్రాంతంలో సాధారణ జీవితం గడిపే యువకుడు.. చివరకు దేశం తరఫున రెజ్లింగ్‌లో ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎలా ఎదిగాడన్నదే కథలో ప్రధాన అంశంగా కనిపిస్తోంది.
* రామ్ చరణ్‌లో కొత్త కోణం…
ఇప్పటివరకు మాస్, యాక్షన్ హీరోగా కనిపించిన రామ్ చరణ్ ఈ సినిమాలో చాలా ఎమోషనల్ పాత్రలో కనిపిస్తున్నారని అభిమానులు చెబుతున్నారు. ట్రైలర్లో అతని కళ్లలో కనిపించే బాధ, పోరాటం, ఒంటరితనం సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి.
సాధారణ హీరో ఎలివేషన్లకు భిన్నంగా, పాత్రలోని బలహీనతలను కూడా చూపించడం దర్శకుడు బుచ్చిబాబు స్టైల్ అని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ట్రైలర్లో స్వల్పంగా కనిపించిన ఢిల్లీ ఎపిసోడ్ సినిమాకి అసలు ఎమోషనల్ హార్ట్ అయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అలాగే జగపతి బాబు అప్పలసూరి (Appalasuri) పాత్ర కూడా కథలో బలమైన భావోద్వేగాన్ని తీసుకురానుందని ట్రైలర్ హింట్ ఇచ్చింది.
* టెక్నికల్‌గా కూడా హై స్టాండర్డ్స్…
సినిమాటోగ్రఫీ అందిస్తున్న R. Rathnavelu విజువల్స్ ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మరోవైపు సంగీత దర్శకుడు A. R. Rahman అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌లోని భావోద్వేగాలను మరింత బలంగా ఎలివేట్ చేసిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
* కమర్షియల్ ఫార్ములాకి భిన్నంగా…
ప్రస్తుతం వస్తున్న సాధారణ కమర్షియల్ సినిమాల తరహాలో కాకుండా.. “పెద్ది” పూర్తిగా పాత్రల భావోద్వేగాలు, జీవన పోరాటం, వ్యక్తిత్వ ప్రయాణం చుట్టూ తిరిగే చిత్రంగా కనిపిస్తోంది.
అందుకే చాలామంది సినీ అభిమానులు ఇది రంగస్థలం (Rangasthalam) తర్వాత రామ్ చరణ్ కెరీర్లో మరో బలమైన పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ మూవీ అవుతుందని అభిప్రాయపడుతున్నారు.
ALSO READ :

1 thought on “PEDDI – RAM CHARAN | మరో ‘రంగస్థలం’ అవుతుందా?”