Shivunipalli Student National Baseball Selection
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మునిసిపాలిటీ పరిధి శివుని పల్లి హై స్కూల్ విద్యార్థి జాతీయ స్థాయి సబ్ జూనియర్ బేస్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుసుమ రమేష్ తెలిపారు. శుక్రవారం ఇక్కడ మాట్లాడుతూ గత నెల 28 నుండి 30 వ తేదీ వరకు జరిగిన తెలంగాణా రాష్ట్ర స్థాయి బేస్ బాల్ పోటీలలో జడ్పీహెచ్ఎస్ శివునిపల్లి పాఠశాలకు చెందిన గుగులోత్ మధుసూదన్ జనగామ జిల్లా నుండి రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొని మంచి క్రీడా నైపుణ్యంతో, క్రీడా ప్రతిభ ను కనబరిచి 30వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ బేస్ బాల్ పోటీలకు ఎంపికైనారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుసుమ రమేష్ తెలిపారు. జాతీయ స్థాయికి ఎంపికైన గుగులోతు మధుసూదన్ (10 వ తరగతి విద్యార్థి) ఈనెల 24 నుండి 29 వరకు ఒడిస్సా లోని భువనేశ్వర్ లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటాడని పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ కొండ రవి తెలిపారు. ఈ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థిని 2 వార్డ్ కౌన్సిలర్ గుర్రం హరినాథ్ మరియు పాఠశాల అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ రాధిక, పాఠశాల పూర్వ విద్యార్థుల కమిటీ అధ్యక్షులు జొన్నల రాజేశ్వర్, యంజాల ప్రభాకర్, నాగ బండి వెంకట్ రామ్ నరసయ్య , క్రీడా పోషకులు, క్రీడాదాత గోలి రాజశేఖర్, పాలకుర్తి సోమశేఖర్ క్రీడా కారున్ని అభినందిస్తూ జాతీయ స్థాయిలో జరిగే బేస్ బాల్ క్రీడలలో మంచి ప్రతిభను, కనబరిచి విజయం సాధించాలని పాఠశాలకు, మన గ్రామానికి మరియు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని కోరారు. జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థినీ జనగామ జిల్లా బేస్ బాల్ సెక్రటరీ నరేష్ పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందిస్తూ ఆర్ధిక సహాయం అందించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
