PT Usha Meets Revanth
* సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పి.టి.ఉష
ఆకేరు న్యూస్, హైదరాబాద్: భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష హైదరాబాద్లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. గచ్చీబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ (#YIPESU) ప్రారంభోత్సవంలో పాల్గొనడానికి వచ్చిన ఆమె, ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో సీఎంను కలిసి పలు అంశాలపై చర్చించారు.
