ACP Bhim Warning Rowdy Sheeters
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
రౌడీ షీటర్లు సత్ప్రవర్తన కలిగి ఉండాలని, అసాంఘిక కార్యక్రమాల పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్టేషన్ ఘన్ పూర్ ఏసిపి భీమ్ శర్మ రౌడీ షీటర్లను హెచ్చరించారు. జనగామ జిల్లా రఘునాథపల్లి సర్కిల్ కార్యాలయంలో రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎడవల్లి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏసిపి మాట్లాడుతూ రౌడీ రౌడీ షీటర్లు చట్టాన్ని గౌరవిస్తూ, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని, ఎలాంటి నేర కార్యకలాపాలకు పాల్పడకూడదని సూచించారు. సమాజంలో మంచి ప్రవర్తనతో ఉండాలని, కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కలిగి ఉండాలని, ఉపాధి అవకాశాలపై దృష్టి పెట్టి సక్రమమైన జీవన విధానం పాటించాలని కోరారు. రౌడీ షీటర్లపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని, మళ్లీ నేర కార్యకలాపాలలో పాల్గొంటే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. భవిష్యత్తులో మంచి ప్రవర్తనతో ఉండాలని సూచించారు. అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అనంతరం రఘునాథపల్లి, లింగాలఘన్పూర్ పరిధిలోని రౌడీ షీటర్లను తాసిల్దారుల ముందు ముందు మంచి ప్రవర్తన కోసం బైండ్ ఓవర్ చేశారు.
సిఐ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల రక్షణతో పాటు భద్రత కల్పించడం ఆసాంఘిక కార్యక్రమాలను అరికట్టడమే లక్ష్యంగా పోలీసులు ముందున్నారన్నారు. ఎవరైనా ప్రజాజీవానికి భంగం కలిగించిన చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన చర్యలు తప్పని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రాకేష్ రెడ్డి, ఎస్సైలు నరేష్ యాదవ్,
శ్రవణ్ కుమార్ గౌడ్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
