Women Building Foundation Ceremony in Chilpur
అకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా చిల్పూర్ మండలం తీగల తండాలో మహిళా భవన నిర్మాణానికి సోమవారం భూమి పూజ చేశారు. రూ.10 లక్షల వ్యయంతో నిర్మించే మహిళా భవన నిర్మాణ పనులు గ్రామ సర్పంచ్ తీగల సాంబరాజు ఆధ్వర్యంలో చేపట్టారు. కార్యక్రమంలో పాల్గొన్న చిల్పూర్ గుట్ట దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు మాట్లాడుతూ మహిళా సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. ఐకెపి కొనుగోలు కేంద్రాల నిర్వహణ, ఆర్టీసీ బస్సులు, స్వయం ఉపాధి పథకాలతో మహిళలని కోటీశ్వరుని చేయడం ప్రభుత్వం లక్ష్యంగా పని చేస్తుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును మహిళలు అందిపుచ్చుకొని అభివృద్ధి పథంలో సాగాలని ఆయన కోరారు. దేశాయి తండా సర్పంచ్ వెంకటేష్, వెంకటేశ్వర పల్లి సర్పంచ్ వీరస్వామి, ఉప సర్పంచ్ వెంకన్న, వార్డు సభ్యులు మండల పార్టీ అధ్యక్షుడు గడ్డమీద సురేష్ కుమార్, దేవస్థానం డైరెక్టర్ సూరయ్య నాయకులు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
