Actor Ranveer Singh Don 3 Controversy Ban
ఆకేరు న్యూస్, సినిమా డెస్క్ :
‘దురందర్’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్న బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్‌కు ఊహించని షాక్ తగిలింది. ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) ఆయనపై ‘సహాయ నిరాకరణ ఉత్తర్వులు’ (Non-Cooperation Directive) జారీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. తాజా వివాదం పరిష్కారం అయ్యేంత వరకు పరిశ్రమకు చెందిన ఏ టెక్నీషియన్, కార్మికుడు ఆయనతో కలిసి పనిచేయకూడదని ఫెడరేషన్ ఆదేశించింది.
* అసలేం జరిగింది? వివాదానికి కారణం ఇదే..
దర్శక-నిర్మాత ఫర్హాన్ అక్తర్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ డాన్ -3 నుంచి రణవీర్ సింగ్ అకస్మాత్తుగా తప్పుకోవడమే ఈ వివాదానికి మూలకారణం. ఈ సినిమా కోసం అధికారిక ప్రకటన వచ్చి, షూటింగ్ ప్రారంభం కావడానికి కొద్ది రోజుల ముందు ఈ వివాదం తెరమీదకు వచ్చింది. రణవీర్ స్క్రిప్ట్ పరమైన విభేదాల కారణంగా ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని అంటున్నారు.
.ఆయన తప్పుకోవడం వల్ల తమకు దాదాపు Rs.45 కోట్ల భారీ నష్టం వాటిల్లిందని అంటున్నారు. ఈమేరకు చిత్ర నిర్మాణ సంస్థ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ కు సంబందించిన ఫర్హాన్ అక్తర్, రితేష్ సిధ్వానీలు ఆరోపించారు. . ఈ నష్టపరిహారాన్ని రణవీర్ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ (IFTA) ద్వారా ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ ( FWICE )ని ఆశ్రయించారు.
* నిషేదం ఎంతకాలం..?
ఈ సమస్యను పరిష్కరించేందుకు FWICE ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ సమావేశానికి ఫర్హాన్ అక్తర్ వర్గం హాజరైనప్పటికీ, రణవీర్ సింగ్ గానీ లేదా ఆయన ప్రతినిధులు గానీ హాజరు కాలేదు. ఫెడరేషన్ పిలుపును ఖాతరు చేయకపోవడాన్ని కమిటీ తీవ్రంగా పరిగణించింది.
డాన్ – 3 లాంటి పెద్ద ప్రాజెక్ట్ అకస్మాత్తుగా రద్దు కావడం వల్ల వందలాది మంది దినసరి సినీ కార్మికులు లైట్ మెన్, సెట్ వర్కర్లు, జూనియర్ ఆర్టిస్టులు ఉపాధి కోల్పోయారని FWICE ప్రతినిధులు స్పష్టం చేశారు. పరిశ్రమలో స్టార్ల కంటే నిబంధనలే ముఖ్యమని ఫెడరేషన్ హెచ్చరించింది.
* భవిష్యత్తు చిత్రాలపై ప్రభావం..?
ప్రస్తుతం విధించిన సహాయ నిరాకరణ (Non-Co operation) ఆంక్షల వల్ల రణవీర్ సింగ్ భవిష్యత్తు సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదు. రాబోయే కొత్త సినిమాలు, బ్రాండ్ షూటింగ్‌లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ ₹45 కోట్ల వివాదంపై రణవీర్ సింగ్ అధికారికంగా స్పందించి, ఫెడరేషన్తో చర్చలు జరిపితే తప్ప ఈ నిషేధం తొలగిపోయేలా కనిపించడం లేదు. బాలీవుడ్ వర్గాల్లో ఇప్పుడు ఈ అంశమే హాట్ టాపిక్‌గా మారింది.
—————————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
