Satish Political Leader Award
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ డివిజన్ కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొలిపాక సతీష్ ఉత్తమ పొలిటికల్ లీడర్ అవార్డు అందుకున్నాడు. హైదరాబాద్ లో నాయీబ్రాహ్మణ జనసంస్థ ఆధ్వర్యంలో ఉత్తమ పొలిటికల్ లీడర్ గా సీసీఎంమినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ భారత ప్రభుత్వ డాక్టర్ సారంగపాణి, కార్టూనిస్ట్ సుధాకర్ శ్రీధర్, ఓయూ రాజేశ్, ప్రొఫెసర్ సావిత్రి, దుర్గా రాణి చేతులు మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. నాయీబ్రాహ్మణ జనసంస్థ 9వ వార్షికోత్సవం సందర్భంగా దాదాపు 28 సంవత్సరాలు రాజకీయాల్లో రాణిస్తూ, ప్రజా సమస్యల కోసం శ్రమిస్తూ, సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఒకే పార్టీలో (కాంగ్రెస్) పని చేస్తున్న సతీష్ సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో సుశీల్, గోవిందరాజు, గోపాలకృష్ణ, సుబ్బయ్య, రమేష్, అశోక్ కుమార్, నవణిత, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
