Sanatana Dharma Hindu Sammelan
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
భారతదేశం వేదాలకు, ఉపనిషత్తులకు నిలయమని ప్రపంచ దేశాలకు సంస్కృతిని, సాంప్రదాయాన్ని నేర్పిన మనం మన సంస్కృతి సాంప్రదాయాలను మరవద్దని శ్రీధర్ ఆనంద స్వామి తెలిపారు. జనగామ జిల్లా జఫర్గడ్ మండలం ఉప్పుగల్లులో జరిగిన హిందూ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గడ్డం రాజు అధ్యక్షతన జరిగిన ఈ సమ్మేళనంలో శ్రీధర్ ఆనంద స్వామి మాట్లాడుతూ శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకుని రామరాజ్యం నెలకొల్పాలని పిలుపునిచ్చారు. జర్నలిస్టు (R Voice chennel) మేనేజింగ్ డైరెక్టర్ నవత మాట్లాడుతూ మన దేశంలో హిందువులు ఆచరిస్తున్న విధానాలతో పంచ పరివర్త తీసుకురావాలని కుటుంబ విలువలు, కుటుంబ సంబంధ బాంధవ్యాలను పెంచుకోవాలని భారతీయ వస్తువులను వినియోగించుకోవాలని కోరారు.
లక్ష్మణ్ సుధాకర్ జి మాట్లాడుతూ వందల సంవత్సరాలుగా భారతదేశంలో హిందువులు అనుభవిస్తున్న కష్టాలను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ ఏ విధంగా హిందుత్వాన్ని కాపాడుకుంటూ వచ్చింది. హిందువులు ఏ విధంగా అలచివేతకు గురైనారు ప్రస్తుత పరిస్థితులలో హైందవ సమాజం ఒక్కటిగా కావాలని పిలుపునిచ్చారు. అంతకుముందు గ్రామంలో హనుమాన్ శోభాయాత్రను హిందూ సమ్మేళనం అధ్యక్షులు గడ్డం రాజు, గ్రామ సర్పంచ్ కొడాలి సాoబరాజు, ఉప సర్పంచ్ యాట మధు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హిందూ సమ్మేళన సమితి మూడు మండలాల ఇంచార్జ్ డాక్టర్ హేమంత్ రాజు, స్టేషన్ ఘన్ పూర్ మండల అధ్యక్షుడు పాలకుర్తి సోమశేఖర్ కమిటీ సభ్యులు, వార్డు సభ్యులు మాజీ ప్రజాప్రతినిధులు తిమ్మంపేట, తమ్మడపల్లి, కోనూరు గ్రామాల నుండి సుమారు 1000 మంది పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
