National Technology Day Celebration
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మునిసిపాలిటీ పరిధి శివునిపల్లిలో జాతీయ సాంకేతిక దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం “మేర యువ భారత్ వరంగల్” కేంద్రం పర్యవేక్షణలో ‘హాని కంప్యూటర్ ఎడ్యుకేషన్’ డైరెక్టర్ నీల రాకేష్ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు ప్రోగ్రాం కోఆర్డినేటర్ నవిన్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మనం దేశ శాస్త్ర, సాంకేతిక రంగాల విజయాలను గుర్తు చేయడం కోసం “జాతీయ సాంకేతిక దినోత్సవం” జరుపుకుంటున్నాము నారు. 1998 మే 11వ తేదీన భారతదేశం రాజస్థాన్లోని పోఖ్రాన్లో నిర్వహించిన “ఆపరేషన్ శక్తి” (అణు పరీక్షలు) ద్వారా యావత్ ప్రపంచానికి మన సత్తాను చాటి చెప్పింది. అదే రోజున భారతదేశం మొట్టమొదటి స్వదేశీ విమానం ‘హంస-3’ ను విజయవంతంగా ప్రదర్శించింది. అప్పటి నుంచి ఈ చారిత్రాత్మక రోజును మనం సాంకేతిక దినోత్సవంగా జరుపుకోవడం దేశానికి గర్వకారణం అన్నారు. ఈ సంవత్సరం (2026) జాతీయ సాంకేతిక దినోత్సవం “అందరి అభివృద్ధి కోసం బాధ్యతాయుతమైన ఆవిష్కరణలు” (Responsible Innovation for Inclusive Growth) అనే ముఖ్యమైన నినాదంతో ముందుకు సాగుతోంది. నేడు సైన్స్ మరియు టెక్నాలజీ కేవలం పరిశోధనలకే పరిమితం కాకుండా, సామాన్య ప్రజల జీవితాలను సులభతరం చేయడానికి ఉపయోగపడుతున్నాయి అన్నారు. వ్యవసాయం, వైద్యం, అంతరిక్ష పరిశోధనలు, డిజిటల్ చెల్లింపుల వంటి ప్రతి రంగంలోనూ భారత్ సాధిస్తున్న ప్రగతి అద్భుతం అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో హాని కంప్యూటర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నీల రాకేష్, కన్వీనర్ నీల వెంకటేశ్వర్లు, ప్రోగ్రాం కోఆర్డినేటర్ నవిన్ యాదవ్, ట్రైనర్స్ సంధ్య, చందర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
