Government School Enrolment Drive
ఆకేరు న్యూస్ రాయపర్తి:-
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట” కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని (ఎన్రోల్మెంట్ ) గణనీయంగా పెంచాలని రాయపర్తి తహసిల్దార్ ఎం శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
బుధవారం రాయపర్తి మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎం పి డీ ఓ ) కార్యాలయంలో బడిబాట కార్యక్రమం మరియు స్వచ్ఛ భారత్ మిషన్ అమలుపై మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా తహసిల్దార్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రతి అధికారి, ఉపాధ్యాయుడు క్షేత్రస్థాయిలో పర్యటించి బడి ఈడు పిల్లలను గుర్తించి వంద శాతం ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించేలా కృషి చేయాలని ఆదేశించారు.
* పాఠశాలలపై నమ్మకం కలిగించాలి: ఎం పి డీ ఓ కూచన ప్రకాశ్
ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న నాణ్యమైన విద్య, వసతుల పట్ల ప్రజల్లో మరియు తల్లిదండ్రుల్లో సంపూర్ణ నమ్మకాన్ని కలిగించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. బడిబాట విజయవంతానికి విలేజ్ లెవెల్ కమిటీలు చురుగ్గా పనిచేయాలని .
అదేవిధంగా, స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ‘ఘన వ్యర్థాల నియమావళి – 2026’ (Solid వేస్ట్ మానేజ్మెంట్ రూల్స్ 2026) పై మండల వ్యాప్తంగా విస్తృత అవగాహన కల్పించాలని కోరారు.
ఇకపై ఇళ్ల నుండి సేకరించే చెత్తను తడి, పొడి, హానికరం (హాజరుదొస్ ), మరియు పునర్వినియోగానికి పనికొచ్చే (రేసైకిలబ్లె ) చెత్తగా నాలుగు రకాలుగా విభజించేలా (సిగ్రీగేషన్ ) ప్రజలను చైతన్యపరచాలని, ఇందుకు గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు.
* పథకాలపై అవగాహన కల్పించాలి: ఎం ఈ ఓ శ్రీనివాస్
బడిబాట నోటీస్ ప్రతి పాఠశాల నుండి క్లాస్ వారీగా విద్యార్థుల నమోదు వివరాలను గూగుల్ స్ప్రెడ్షీట్ ద్వారా రోజువారీగా నమోదు చేసేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల కోసం అమలు చేస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు,యూనిఫారాలు, మధ్యాహ్న భోజన పథకం మరియు ఇతర సంక్షేమ పథకాల గురించి గ్రామాల్లో ప్రజలకు వివరించి, ప్రభుత్వ విద్య వైపు మొగ్గు చూపేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు.
ఈ సమావేశంలో మండల స్థాయి అధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు (సీ ఆర్ పి ఎస్ ) మరియు ఐ సి డి ఎస్ , ఐ కే పీ సిబ్బంది మరియు పంచాయితీ కార్యదర్శులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
