ఆకేరు న్యూస్ డెస్క్ : అమెరికా(America) లోని టెక్సాస్‌లో(Texas) మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. టెక్సాస్‌లోని రౌండ్ రాక్ (Round Rock)లో జరిగిన జునెటీన్త్ ఫెస్టివల్ (Juneteenth event) (అమెరికాలో బానిసత్వం ముగింపు వేడుక)లో ఈ కాల్పులు జరిగాయి. రెండు గ్రూపుల మధ్య గొడవలో ఓ ఆగంతుకుడు తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడని పోలీసులు తెలిపారు. కాల్పుల్లో ఇద్దరు మరణించగా (Two people died) మరో 14 మంది గాయాల పాలయ్యారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా ఇద్దరు మరణించారని పేర్కొన్నారు. గాయపడ్డ వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. కాల్పులకు తెగబడ్డ వ్యక్తి నల్లజాతీయుడని పేర్కొన్నారు. నిందితుడి వివరాలు తెలిపిన వారికి 5 వేల రివార్డును కూడా ప్రకటించారు.
——————-