MLA Yashaswini Reddy Tribal Road Development
ఆకేరు న్యూస్ రాయపర్తి:- మారుమూల ప్రాంతాల గిరిజన తండాలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పేర్కొన్నారు తెలంగాణ ప్రభుత్వ సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటిడిఏ) ఎటునాగారం ఆధ్వర్యంలో మంజూరైన అభివృద్ధి పనుల్లో భాగంగా
మండలంలోని కొండూరు గ్రామ ఆర్&బి రోడ్డు నుండి భోజ్యా తండా వరకు 2 కోట్ల 43 లక్షల 44 వేల రూపాయల వ్యయంతో.పోతురెడ్డిపల్లి పిఆర్ రోడ్డు నుండి లాకావత్ తండా వరకు1 కోటి 51 లక్షల 26 వేల వ్యయంతో. సూర్య తండ పిఆర్ రోడ్డు నుండి చక్రు తండా వరకు 40 లక్షల వ్యయంతో. ఏకే తండా గ్రామ పరిధిలోని రాగడి తండా నుండి రావూరి తండా క్రాస్ రోడ్డు వరకు ఒక కోటి 42 లక్షల 35 వేల వ్యయంతో నిర్మించనున్న బిటి రోడ్డు పనులను STSDF 2025-26 నిధుల ద్వారా చేపడుతున్న పనులకు ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాల్గొని ప్రారంభించారు అనంతరం మాట్లాడు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రహదారుల నిర్మాణం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తోందన్నారు. ఈ రోడ్డు నిర్మాణంతో మండల ప్రజలకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడటంతో పాటు రైతులకు, విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు..
అభివృద్ధి పనులను నాణ్యతతో, పాటు వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు..ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల నాయకులు, అధికారులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
