Etela Rajender Controversy Mudiraj
అకేరు న్యూస్, వరంగల్: హైదరాబాద్‌లో బీజేపీ నేత, మాజీ మంత్రి, మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్‌కు వ్యతిరేకంగా కట్టిన బ్యానర్లను వరంగల్ ఉమ్మడి జిల్లా తెలంగాణ ముదిరాజ్ మహాసభ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు మహాసభ ఆధ్వర్యంలో గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మహాసభ నేతలు చొప్పరి సోమయ్య ముదిరాజ్ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ, రాజకీయ విభేదాలు ఉన్నా వ్యక్తిగత దూషణలు, రెచ్చగొట్టే బ్యానర్లు కట్టడం సరైన పద్ధతి కాదన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఈటల రాజేందర్ పోషించిన పాత్రను గుర్తు చేస్తూ, ప్రజా నేతగా ఆయనకు గౌరవం ఇవ్వాల్సిందేనని అన్నారు .
ఇలాంటి చర్యలు సమాజంలో చీలికలు తెస్తాయని, భవిష్యత్తులో ఇలాంటి రెచ్చగొట్టే కార్యక్రమాలకు పాల్పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని మహాసభ డిమాండ్ చేసింది.
వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన అర్బన్ జిల్లా అధ్యక్షులు బయ్య సామి మాట్లాడుతూ ఈటెల రాజేందర్ తెలంగాణ ఉద్యమంలో గ్రామ గ్రామాన తిరుగుతూ తెలంగాణ తేవటములో ఎంతో కృషి చేయడం జరిగిందని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో అసెంబ్లీలో పోరాడిన వ్యక్తి రాజేందర్ అని తెలిపారు.
