Jr NTR sents Cookies to Fan, Video Viral in Social Media
* అభిమాని కోరికను నిజం చేసిన ఎన్టీఆర్
* ఇంటికే కుకీస్ పంపించి సర్ప్రైజ్!
ఆకేరు న్యూస్, డెస్క్: హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) మరోసారి తన అభిమానుల పట్ల ఉన్న ప్రేమను చాటుకున్నారు. సోషల్ మీడియాలో సరదాగా మొదలైన ఓ సంభాషణ, చివరకు అభిమానిని ఆనందంలో ముంచెత్తిన మధురమైన సంఘటనగా మారింది.
ఇటీవల ఎన్టీఆర్ తన ఇంట్లో స్వయంగా కుకీస్ తయారు చేసిన వీడియోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. “My First Bake” అంటూ ఆయన చేసిన ఈ పోస్ట్ అభిమానులను ఆకట్టుకుంది.
అదే సమయంలో ఓ అభిమాని సోషల్ మీడియాలో స్పందిస్తూ, “మా ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు అన్నా.. రెండు కుకీస్ పంపించు” అంటూ సరదాగా పోస్ట్ చేశాడు.
దీనికి ఎన్టీఆర్ కూడా తనదైన స్టైల్లో ఫన్నీగా స్పందించడంతో ఆ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే చాలా మంది అది కేవలం సరదా చాట్‌తోనే ముగిసిపోతుందని భావించారు.
కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఎన్టీఆర్ నిజంగానే ఆ అభిమానికి తన చేతులతో తయారు చేసిన కుకీస్‌ను (Cookies) పంపించారు. కుకీస్ అందుకున్న అభిమాని ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

తన అభిమానులపై ఎన్టీఆర్ (Jr NTR) చూపించిన ఈ ప్రత్యేక అభిమానానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. స్టార్ హీరో స్థాయిలో ఉన్నప్పటికీ, ఓ అభిమాని చేసిన చిన్న కోరికను గుర్తుంచుకుని దానిని నెరవేర్చడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనమని ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రస్తుతం కుకీస్‌తో కూడిన ఈ మధురమైన సర్ప్రైజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు “ఇదే మా తారక్ అన్న”, “ఫ్యాన్స్‌ను కుటుంబ సభ్యుల్లా చూసుకునే హీరో” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
