Financial Support Burra Ramesh Family
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
మిత్రుడి అకాల మరణంతో ఒంటరైన అతడి కుటుంబానికి బాల్యమిత్రులు ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలిచారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కురచపల్లికి చెందిన బుర్ర రమేష్ స్టేషన్ ఘన్ పూర్ మండలం ఇప్పగూడెంలో హై స్కూల్ వరకు చదువుకున్నాడు. గీత కార్మికుడిగా స్థిరపడిన రమేష్ రోజువారి విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు పది రోజుల క్రిందట తాటి చెట్టు పైనుండి పడి మరణించాడు. రమేష్ మృతితో ఆ కుటుంబ ఒంటరి అయింది. విషయం తెలుసుకున్న బాల్యమిత్రులు (1996-97) రమేష్ కుటుంబానికి అండగా ఉండేందుకు రూ. 35 వేల ఆర్థిక సహాయాన్ని ఆదివారం మృతుడి భార్య రేణుక, కూతురు భవ్య శ్రీ, కుమారుడు సాయి భార్గవ్ కు అందజేసి తామున్నామని మనోధైర్యాన్ని ఇచ్చారు. కార్యక్రమంలో మంద రాజేందర్, పుప్పాల సత్యనారాయణ, ఉపేందర్ రెడ్డి, మర్రి రఘుపతి, బొంకూరి యాకయ్య, గంగారపు భవాని, యమునా, వంగాల కవిత, ఆరుట్ల రాణి, రమ తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
