JioTag 2 India Launch
* ఆండ్రాయిడ్, ఐఫోన్ రెండింటికీ సపోర్ట్
ఆకేరు న్యూస్, డెస్క్:
తాళాలు, బ్యాగ్, పర్స్ వంటి ముఖ్యమైన వస్తువులు తరచూ మర్చిపోయే వారికి రిలయన్స్ జియో గుడ్ న్యూస్ చెప్పింది.
కంపెనీ కొత్త జియో ట్యాగ్ 2 (JioTag 2) స్మార్ట్ ట్రాకర్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈసారి ఆండ్రాయిడ్ (Android) , ఐఫోన్ (iPhone) రెండింటికీ సపోర్ట్ ఇవ్వడం దీని అతిపెద్ద ప్రత్యేకత.
* ధర, లభ్యత
జియో ట్యాగ్ 2 ధర రూ.1,249గా నిర్ణయించారు. ఎంపిక చేసిన బ్యాంక్ ఆఫర్లతో రూ.1,199కే కొనుగోలు చేసే అవకాశం ఉంది. బ్లాక్, రెడ్, గ్రీన్ రంగుల్లో లభిస్తున్న ఈ ట్రాకర్ ప్రస్తుతం అమెజాన్‌లో అందుబాటులో ఉంది.
* ఏం కొత్తగా వచ్చింది?
జియో ట్యాగ్ 2 ఇప్పుడు Google Find Hub మరియు Apple Find My నెట్‌వర్క్‌లకు సపోర్ట్ చేస్తుంది. దీంతో ఆండ్రాయిడ్ (Android) , ఐఫోన్ (iPhone) వినియోగదారులు ఇద్దరూ తమ తాళాలు, బ్యాగులు, పర్స్ వంటి వస్తువులను సులభంగా ట్రాక్ చేయవచ్చు.
బ్లూటూత్ పరిధిని దాటిపోయినా చివరిసారిగా గుర్తించిన లొకేషన్‌ను మ్యాప్‌లో చూపిస్తుంది.
* ముఖ్యమైన ఫీచర్లు
జియో ట్యాగ్ 2 (JioTag 2)లో 120dB బిల్ట్-ఇన్ స్పీకర్ ఉండటంతో యాప్ ద్వారా సౌండ్ ప్లే చేసి వస్తువును వెంటనే గుర్తించవచ్చు. IP64 రేటింగ్ ఉండటం వల్ల దుమ్ము, నీటి చినుకుల నుంచి రక్షణ లభిస్తుంది. రోజువారీ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని పాలీకార్బోనేట్ బాడీతో దీన్ని రూపొందించారు.
అధికారిక వెబ్సైట్ : https://www.jio.com/jiotag/
Please tell us what is wrong. Your report will be sent to the website team.
