Kavitha Comments on Pawan Kalyan
అకేరు న్యూస్, వరంగల్ : జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై హాట్ కామెంట్ చేసారు TRS పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. బలమైన ప్రతిపక్షం కోసం జనాలు ఎదురు చూస్తున్నారు, అందుకోసమే మా పార్టీ పుట్టిందనీ కవిత తెలిపారు.
పవన్ కళ్యాణ్ తెలంగాణకు రావచ్చు, పోవచ్చు, సినిమాలు తీసుకోవచ్చు, ప్యాకప్ లు మేకప్ లు చేసుకోవచ్చు.. అక్కడి వరకు ఉంటేనే బాగుంటదనీ కవిత హితవి పలికారు.
ఆంధ్ర నిరంకుశ పాలన నుంచి బయటికి రావడానికి తెలంగాణ ఉద్యమం చేశాం అని కవిత గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో రాజకీయం చేసుకోవాలి, తెలంగాణలో సినిమాలు తీసుకోవాలని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్వరాష్ట్రం కోసం ఎంతోమంది బలిదానాలు తీసుకున్న తర్వాతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం అని కవిత గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పుట్టకముందే తెలంగాణ నినాదం పుట్టిందని అన్నారు.
పవన్ కళ్యాణ్ తెలంగాణలో పొలిటికల్ గా ఆన్ ఫిట్…అని కవిత ఆరోపించారు.
తెలంగాణ సెక్రటేరియట్ వైపు చూస్తే మేము ఊరుకునేది లేదు పవన్ కళ్యాణ్ కు స్ట్రాంగ్ వార్నిగింగ్ ఇచ్చారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
