International Yoga Day Thorrur
ఆకేరు న్యూస్ తొర్రూర్: యతీరాజారావు ఫ్రెండ్స్ వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కత్తి రవీందర్ మాట్లాడుతూ యోగా అంటే ఏమిటి ? యోగ అనే పదం సంస్కృత మూలం యుజ్ నుండి వచ్చింది దీని అర్ధం “కలయిక ” లేదా “ఏకం చేయడం” శరీరం మనస్సు మరియు ఆత్మలను ఏకం చేయడమే యోగ ముఖ్య ఉద్దేశం. యోగాతో మానసిక ప్రశాంతతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని తెలిపారు.
ప్రతి ఒక్కరూ ప్రతిరోజు దీనిని దినచర్యలో భాగంగా చూడాలని తెలిపారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు యోగాచేయవలసినదేనాని స్పష్టం చేశారు. యోగ అనేది దినచర్యలో ముఖ్యమైన కర్తవ్యమని తెలిపారు.
యతీరాజారావు ఫ్రెండ్స్ వాకర్స్ గౌరవ సలహాదారు ఎంఈఓ బుచ్చయ్య మాట్లాడుతూ దైనందిక జీవితంలో మానవులు అనారోగ్యానికి మానసిక ఒత్తిడికి గురవుతున్నారని వీటన్నిటికీ పరిష్కారం యోగా ఆసనాలు, ధ్యానం పరిష్కారమని తెలిపారు .ఈ కార్యక్రమంలో ట్రెజరర్ రాములు, జాయింట్ సెక్రెటరీ మంగమ్మ , యాకుబ్ అలీ,వెంకన్నా, కరాటే శ్రీధర్ వీరన్న, రమేష్, యాకూబ్ రెడ్డి, సొమ్ల నాయక్ కరాటే విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు
