Fake Seeds PD Act Warning
* నకిలీ విత్తనాలు అమ్మితే పిడి యాక్ట్
-రూరల్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
నకిలీ విత్తనాలు అమ్మితే పిడి యాక్ట్ కేసులు నమోదు చేస్తామని రూరల్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. అదివారం ఆయన మాట్లాడుతూ వానకాలం సాగు సీజన్ ఆరంభమైనందున రఘునాథపల్లి, లింగాల గణపురం, చిల్పూర్ మండలాలలో రైతులు అప్రమత్తంగా ఉండాలని రూరల్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎడబెల్లి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. నకిలీ విత్తనాలు ఎరువులు అమ్మకాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు.
నకిలీ విత్తనాలు ఎరువులు అమ్మకాలు దొరికితే పీడి యాక్ట్ కేసులు నమోదు చేసి లైసెన్సులు రద్దుచేసి షాపులు సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. విత్తనాలు ఎరువులు కొనుగోలు విషయంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని కొనుగోలు రసీదు, బ్యాచ్ నెంబరు, రైతుల వివరాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. అపరిచితులు గ్రామాలలో సంచరించి నకిలీ విత్తనాలు అమ్మేవారు ఉంటే పోలీసులకు, వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నకిలీ విత్తనాలు ఎరువుల రవాణాపై నిరంతర నిఘా ఉంటదని ఆయన తెలిపారు .
Please tell us what is wrong. Your report will be sent to the website team.
