* భూ వివాదం కేసులో ఐదు లక్షలు డిమాండ్
* లక్ష తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సీసీఎస్ ఇన్స్పెక్టర్ సుధాకర్ (CCS Inspector Sudhakar) ఏసీబీ వలలో చిక్కిన ఘటన మరువక ముందే.. లంచం (Bribe) తీసుకుంటూ మరో ఇన్స్పెక్టర్ (Inspector) పట్టుబడ్డాడు. భూ వివాదం కేసులో రూ. లక్ష తీసుకుంటూ సూరారం సీఐ(Suraram CI) ఏసీబీ(ACB) వలలో చిక్కాడు. రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ (DSP Anand Kumar) తెలిపిన వివరాల ప్రకారం.. గాజులరామారం (Gajula Ramaram) లో ఓ భూవివాదం కేసులో రత్నాకరం సాయిరాజ్(Ratnakaram Sairaj) అనే వ్యక్తిపై గతంలో కేసు నమోదైంది. అతడిపై రౌడీషీట్ ఓపెన్ చేయకుండా ఉండాలంటే మూడు లక్షలు (Three lakhs) ఇవ్వాలని సీఐ వెంకటేశం (CI Venkatesham) డిమాండ్ చేశాడు. ఈ మేరకు రెండు లక్షల (Two lakhs) కు ఒప్పందం కుదరడంతో ఆ మొత్తాన్ని సీఐ(CI) కి అందజేశాడు. ఆ తర్వాత అదే స్థలాన్ని డెవలప్మెంట్ చేసుకుంటానని సీఐని ఇటీవల సంప్రదించగా మరో ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయగా రూ. లక్షకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. వెంటనే బాధితుడు ఏసీబీ(ACB) ని ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు ముందస్తుగా రూ. లక్ష ఇస్తామని సీఐకి చెప్పాడు. ఆ మేరకు పోలీస్‌స్టేషన్ (Police Station) కు వెళ్లి సీఐకి డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సీఐ వెంకటేశం (CI Venkatesham) ను అదుపులోకి తీసుకొని ఏసీబీ(ACB) కోర్టు( Court) లో హజరుపర్చనున్నట్టు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.
—————————-