
ట్వీట్, రీట్వీట్‌తో సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల మధ్య వార్
* ట్వీట్, రీట్వీట్‌తో రేవంత్, కేటీఆర్ మధ్య వార్
* పాయింట్ టు పాయింట్ సమాధానాలు
* సింగరేణి బొగ్గుగనుల వేలంపై ఆసక్తికర వాదనలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా 60 బొగ్గు గనుల బ్లాక్ (Coal mining block) లను కేంద్రం వేలానికి ఉంచింది. అందులో తెలంగాణలోని సింగరేణికి చెందిన కొన్ని బ్లాక్‌లు కూడా ఉన్నాయి. తెలంగాణకే చెందిన కేంద్ర బొగ్గు, గనుల శా ఖ మంత్రి కిషన్ రెడ్డి (Union Coal Mines Minister Kishan Reddy) ఆధ్వర్యంలో హైదరాబాద్ (Hyderabad) లోనే ఈ వేలం ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ (Telangana) డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) కూడా హాజరయ్యారు. ఇప్పుడు ఇదే అంశం హాట్ టాపిక్‌గా మారింది. సామాజిక మాధ్యమాల్లో దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది.
అప్పుడు వ్యతిరేకించి.. ఇప్పుడు డిప్యూటీ సీఎంను పంపుతారా?
సింగరేణి బొగ్గు గనుల (Singareni Coal Mines) ను వేలం వేయడంపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) ల మధ్య ట్వీట్ వార్ (Tweet War) పీక్స్‌కి చేరింది. బహిరంగంగా అధికార, ప్రతిపక్షాల మధ్య సాగుతున్న మాటల యుద్ధానికి తోడు.. ఎక్స్ (Twitter) వేదికగా సాగుతున్న ట్వీట్ ఫైట్ (Tweet fight) రాజకీయాలను వేడెక్కిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పై కేటీఆర్(KTR) ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2021లో బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేయాలంటూ, నాలుగు బ్లాక్‌లను సింగరేణికి బదిలీ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పుడు రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ (Tweet) ను రీట్వీట్ (Retweet) చేశారు కేటీఆర్. అప్పుడేమో వేలాన్ని వ్యతిరేకించి, ఇప్పుడు సీఎం (CM) అయ్యాక మాత్రం వేలం పాట కోసం డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క (Deputy Chief Minister Mallu Bhattivikramamarka) ను పంపించడం ఏంటంటూ సూటిగా ప్రశ్నించారు. మీలో వచ్చిన మార్పునకు గల కారణాలు చెప్పాలని కేటీఆర్ నిలదీశారు.
బీఆర్ఎస్ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు..
అయితే కేటీఆర్ ట్వీట్‌ను రేవంత్ రెడ్డి రీట్వీట్ చేస్తూ పాయింట్ టూ పాయింట్ రిప్లై ఇవ్వడం హాట్ టాపిక్ (Hot Topic) అయింది. తెలంగాణ (Telangana) సంస్థల ప్రైవేటీకరణ (Privatization) ను, తెలంగాణ ప్రజల వాటాల అమ్మకానికి కేంద్రం పూనుకున్నా, కేసీఆర్ గవర్నమెంట్ ప్రయత్నించినా, కూడ కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణులు అడుగడుగునా వ్యతిరేకించారని చెప్పారు. కేసీఆర్ (KCR) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కేంద్రం సింగరేణి (Singareni) గనులను తొలిసారి వేలం వేసిందని గుర్తు చేశారు.అంతేకాదు సింగరేణి గనులను అప్పుడే రెండు ప్రయివేట్ కంపెనీలయిన అరబిందో(Aurobindo), అవంతిక (Avantika) కు కట్టబెట్టిందని చెప్పారు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మాట్లాడలేదని కేటీఆర్‌కు కౌంటర్ (Counter to KTR) ఇచ్చారు.
మన బొగ్గు.. మన హక్కు..
అలాగే సింగరేణి గనుల (Singareni Coal Mines) ను ప్రైవేటీకరించడం (Privatization), వేలం వేయడాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క అప్పుడే వ్యతిరేకించారని రేవంత్ రెడ్డి తెలిపారు. అవంతిక, అరబిందో ప్రయివేట్ కంపెనీలకు అప్పగించిన బొగ్గు బ్లాకులను రద్దు చేసి.. తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారని సీఎం చెప్పుకొచ్చారు. దీనికి నాడు భట్టి విక్రమార్క రాసిన లెటర్‌ను కూడా జత చేశారు. తెలంగాణ ప్రజల ఆస్తులను హక్కులను కాపాడేది కాంగ్రెస్ పార్టీ ఒకటేనని అన్నారు. తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెస్‌తోనే సురక్షితమని.. మన బొగ్గు.. మన హక్కును కాపాడి తీరుతామంటూ కేటీఆర్‌కు రిప్లై ఇచ్చారు రేవంత్ రెడ్డి. మొత్తంగా అప్పటి ట్వీట్(Tweet)ను వెతికి కేటీఆర్ రీ ట్వీట్(KTR Retweet) చేస్తే..దానిని మళ్లీ రీట్వీట్(Retweet) చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమాధానం ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
———————————