Financial Assistance to Anil's Family
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
ఆర్థిక ఇబ్బందులతో మృతి చెందిన యువకుడు గద్ద అనిల్ కుమార్ కుటుంబానికి గ్రామస్తులు ఆర్థిక సహాయాన్ని అందించే అండగా నిలిచారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం ఫతేపూర్ గ్రామానికి చెందిన గద్ద అనిల్ తండ్రి ఆరేళ్ల క్రిందమే మృతి చెందాడు. తల్లి, ఇద్దరు చెల్లెలు, తమ్ముడుతో కలిపి ఐదుగురి కుటుంబ భారాన్ని చిన్న వయసులో భుజాన వేసుకున్నాడు. కూలి నాలి పనులు, డ్రైవర్ గా, వ్యవసాయ పనులు చేస్తూ ఇద్దరు చెల్లెళ్ల పెళ్లిళ్లు చేసి ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు. ఈ క్రమంలో మూడు రోజుల క్రిందట గద్ద అనిల్ ఆత్మ హత్య చేసుకున్నాడు. అందరి తలలో నాలుకలా ఉండే అనిల్ మృతి గ్రామస్తులను కలిచివేసింది. చేయి చేయి వేసి ఎవరికి తోచిన విధంగా వారు విరాళం అందించి రూ.30 వేలు మృతుడి కుటుంబానికి అందించనున్నారు. ఫతేపూర్ హార్వెస్టర్ డ్రైవర్ యూనియన్ రూ. 20 వేలు అనిల్ కుటుంబానికి ఆర్ధిక సహాయంగా శుక్రవారం అందించారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు గుగులోతు రాజు, ఉపాధ్యక్షుడు అధ్యక్షులు పురుమాని మహేష్, మెండు కుమార్, గోస్కుల సురేష్, గద్ద అనిల్, గూగులోతు మోతిలాల్, కొర్ర సురేష్, బాధవత్ అశోక్, బాదవత్ మోహన్, మాలోతు నాను, భూక్య అనిల్, గోణాల రామ్ చరణ్, గూగులోతు మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
