Hanumakonda Women Empowerment Model
* మహిళా సంఘాల పనితీరు ప్రశంసనీయం
* మహిళల సాధికారతకు హనుమకొండ ఆదర్శం – జె-పాల్, హార్వర్డ్ ప్రతినిధుల ప్రశంసలు
అకేరు న్యూస్, హన్మకొండ :మహిళల ఆర్థిక సాధికారత, స్వయం ఉపాధి, సామాజిక అభివృద్ధి దిశగా హనుమకొండ జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాలు సాధిస్తున్న పురోగతి అభినందనీయమని జె-పాల్ (J-PAL), హార్వర్డ్ విశ్వవిద్యాలయ ప్రతినిధులు తెలిపారు.
గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయితో జె-పాల్, హార్వర్డ్ విశ్వవిద్యాలయ ప్రతినిధుల బృందం సమావేశమైంది. ఈ బృందంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ ఏమిలి బ్రేజా (Emily Breza,) కార్తీక్ శ్రీవాత్సవతో పాటు జె-పాల్ దక్షిణాసియా బృందం ప్రతినిధులు పాల్గొన్నారు.
అంతకుముందు ప్రతినిధుల బృందం హనుమకొండలోని ఓరుగల్లు మహిళా సమాఖ్య కార్యాలయాన్ని సందర్శించి, మహిళా సంఘాల కార్యకలాపాలు, వాటి ద్వారా మహిళల జీవితాల్లో చోటుచేసుకున్న సామాజిక, ఆర్థిక మార్పులను తెలుసుకుంది. సమాఖ్య చేపడుతున్న కార్యక్రమాలు, గ్రామీణ మహిళల జీవనోపాధి మెరుగుదలకు తీసుకుంటున్న చర్యలు, ఆర్థిక స్వావలంబన దిశగా సాధించిన విజయాలను ఆసక్తిగా పరిశీలించింది.
ఈ సందర్భంగా ఓరుగల్లు మహిళా సమాఖ్య ప్రతినిధులు మహిళా స్వయం సహాయక సంఘాల ఏర్పాటుతో గ్రామీణ మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని, పొదుపు, రుణ సదుపాయాలు, సూక్ష్మ వ్యాపారాల ద్వారా కుటుంబాల ఆర్థిక స్థితిగతులు గణనీయంగా మెరుగుపడ్డాయని వివరించారు. సంఘాల ద్వారా మహిళలు కేవలం ఆర్థికంగా మాత్రమే కాకుండా సామాజికంగా, నాయకత్వ పరంగా కూడా ఎదుగుతున్నారని తెలిపారు.
పరకాల మహిళా డెయిరీని సందర్శించిన ప్రతినిధుల బృందం, మహిళలు సమిష్టి కృషితో నిర్వహిస్తున్న డెయిరీ కార్యకలాపాలను పరిశీల
Please tell us what is wrong. Your report will be sent to the website team.
