Classmates Financial Help Friend Family
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
గుండెపోటుతో మృతి చెందిన స్నేహితుడి కుటుంబానికి రూ.50 ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు స్నేహితులు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం ఇప్పగూడకి చెందిన యువకుడు సట్ల మల్లిక్ ఆకస్మిక గుండెపోటుతో మృతి చెందడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. చిన్న వయస్సులోనే మల్లిక్ మృతి చెందడంతో 2005–2006 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన సహచర విద్యార్థులు ఈ విషాద సమయంలో కుటుంబానికి అండగా నిలిచారు. తమ స్నేహితుడి కుటుంబానికి తోడుగా నిలవాలనే ఉద్దేశంతో అందరూ కలిసి రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా క్లాస్మేట్స్ మాట్లాడుతూ స్నేహితుడిని తిరిగి తీసుకురాలేకపోయినా ఆయన కుటుంబానికి తమ వంతు సహాయం చేయడం తమ బాధ్యతగా భావించామని తెలిపారు. మృతుడి కూతురు సట్ల శివన్షిక పేర రూ. 50 వేల ఫిక్స్డడిపాజిట్ చేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
