Chinna Pendyal High School Infrastructure Issues
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
శిథిలావస్థకు చేరిన చిన్న పెండ్యాల హై స్కూల్ కు యుద్ధ ప్రాతిపదికన నూతన భవన నిర్మాణం చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం చిన్న పెండ్యాల హై స్కూల్ ను సోమవారం సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో సందర్శించారు. ఈ సందర్భంగా రాపర్తి రాజు మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి చిన్న పెండ్యాల హైస్కూల్ సందర్శించాలని కోరారు. ప్రభుత్వ విద్య బలోపేతం చేయాలనే ముఖ్యమంత్రి చెబుతున్న మాటలకు ఆచరణకు పొంతన లేదన్నారు. తన దగ్గరే విద్యాశాఖ ఉంటే విద్యాభివృద్ధి జరుగుతుందని ప్రజలు కూడా నమ్మారు కానీ చిన్న పెండ్యాల హైస్కూల్ సందర్శించితే ఎవరికైనా ప్రభుత్వ పనితీరు అర్థం అవుతుందన్నారు. ఈ పాఠశాల తరగతి గదులు కూలిపోతాయో ప్రమాదకర పరిస్థితుల్లో భయాందోళనలలో విద్యార్థులు ఉపాధ్యాయులు ఉంటున్న స్థితి నెలకొందన్నారు. మూడు తరగతి గదులు ఇప్పటికే కూలిపోయి ఉన్నాయని ప్రహరీ గోడలేదు గేటు లేదు పిల్లలకు మూత్రశాలలు మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉన్నాయని తెలిపారు. పాఠశాలల ప్రారంభానికి ముందే విద్యార్థులందరికీ స్కూల్ యూనిఫామ్ ఇవ్వాల్సి ఉండగా ఇప్పటికీ ఏ ఒక్క విద్యార్థికి కూడా యూనిఫామ్ ఇవ్వలేదన్నారు. నోట్ బుక్స్ సరిగా ఇవ్వలేదన్నారు.
పాఠ్యపుస్తకాలు ఎనిమిదవ తరగతి వృక్షశాస్త్రం 9వ తరగతి హింది పుస్తకాలు రాలేదన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు 20 రకాల ఐటమ్స్ తో విద్యార్థులకు ఉపయోగపడే కిట్టు అందజేస్తామని చెప్పారు తప్ప ఎక్కడ ఇవ్వలేదు అన్నారు. కోతుల బెడద తీవ్రంగా ఉంది అన్నారు. ఈ హైస్కూలు బలోపేతం చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించాలని కోరారు. రాజవరం గ్రామపంచాయతీ పరిధిలో కేజీబీవీ పాఠశాల సైతం అనేక సమస్యలకు నిలయంగా ఉందన్నారు. విద్యార్థులకు భద్రత లేదన్నారు మౌలిక సదుపాయాల కొరత ఉందని సర్వేలో వెళ్లడైందని పేర్కొన్నారు. పిల్లలు తమ బట్టలను ఉతుకొని ఆరవేసేందుకు షెడ్డు లేకపోవడంతో ఆరుబయట వేసుకుంటున్నారని వర్షాకాలం తీవ్ర ఇబ్బందులు పిల్లలు ఎదుర్కొంటున్నారన్నారు. వసతి గృహంలో సరైన పరిశుభ్రత పాటించడం లేదని పిల్లలకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందడం లేదదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని రాపర్తి రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి సాదం రమేష్, జిల్లా కమీటి సభ్యులు మునిగెల రమేష్, సిపిఎం పార్టీ కృష్ణాజిగూడెం గ్రామ ఉపసర్పంచ్ గద్ద కోమల, వార్డు మెంబర్ ఊరడి బుచ్చి రాజ్, రైతు సంఘం మండల అధ్యక్షులు గద్ద కుమార్, కర్రె నాగరాజు, ఊరడి రవి, పోలు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
