Hanumakonda Boy Dies While Fishing Near Tank
Published:
ఆకేరు న్యూస్, హనుమకొండ : హసన్ పర్తి మండలం అరేపల్లి శివారులోని కుమ్మరికుంట చెరువు సమీపంలో విషాదం చోటుచేసుకుంది. కామెరా కృష్ణతేజ (16) చేపలు పట్టేందుకు చెరువులోకి వెళ్లి పెద్ద బండరాయి పక్కన కూర్చొని ఉండగా, అకస్మాత్తుగా బండరాయి కూలిపడింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నప్పటికీ అప్పటికే బాలుడు మృతిచెందినట్లు నిర్ధారించారు. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
