Raiparthy Electric Shock Death
ఆకేరు న్యూస్ రాయపర్తి: కరెంట్ షాక్ తగిలి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలోని బుధవారం చోటు చేసుకుంది. స్థానిక పోలీస్ లు, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని కొత్త రాయపర్తి కాలనికి చెందిన సదరపు శ్రీను (35)మంగళవారం రాత్రి 11 గంటలకు మూత్ర విసర్జన కొరకు లేచి బయటకు వెళుతున్న క్రమంలో బయట ఉన్న ఐరన్ కూలర్ కు తాకడంతో ప్రమాదవాషత్తు కరెంట్ షాక్ కు గురై అపస్మారక స్థితి కి వెళ్ళాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం 108 వాహనంలో వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వైద్యులు పరిశీలించి శ్రీను అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. శ్రీను మృతితో గ్రామంలోని విషాదఛాయలు కల్ముకున్నాయి మృత్తునికి భార్య, ఇద్దరు కుమారులు,ఒక కూతురు ఉన్నారు భార్య సుకన్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై రాజేందర్ తెలిపారు.
