Yashaswini Reddy Inspects Warehouse Construction
ఆకేరు న్యూస్, రాయపర్తి: మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న గోదాం (గోడౌన్) పనులను పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గురువారం పరిశీలించారు. నిర్మాణ ప్రదేశాన్ని సందర్శించిన ఆమె పనుల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంలో గోదాముల నిర్మాణం ఎంతో కీలకమని అన్నారు. రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను భద్రంగా నిల్వ చేసుకునేందుకు ఈ గోదాం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
నిర్మాణ పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ఎలాంటి రాజీ పడకుండా నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
అభివృద్ధి పనులు ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూర్చే విధంగా ఉండాలని, ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేస్తూ పారదర్శకంగా పనులు నిర్వహించాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
