Hanumakonda Traffic Police
Published:
అకేరు న్యూస్ : హనుమకొండ: ట్రాఫిక్ పోలీసులు నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఏసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిపిన ఈ డ్రైవ్లో నిబంధనలకు విరుద్ధంగా నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న 20 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. చట్టపరమైన చర్యల కోసం వీటిని గౌరవ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు.వాహనదారులందరూ తమ వాహనాలకు సరైన నెంబర్ ప్లేట్లు అమర్చుకుని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు. ఇటువంటి తనిఖీలు భవిష్యత్తులోనూ నిరంతరాయంగా కొనసాగుతాయని హనుమకొండ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ స్పష్టం చేశారు.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
