Waddepalli Bund Development Works
* పనులు వేగవంతం చేయాలి
* క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించిన జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న
అకేరు న్యూస్ వరంగల్: గ్రేటర్ వరంగల్ నగరంలోని వడ్డేపల్లి బండ్‌పై కొనసాగుతున్న అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న సంబంధిత అధికారులను ఆదేశించారు.
వడ్డేపల్లి బండ్ వద్ద కొనసాగుతున్న అభివృద్ధి పనులను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతి, నాణ్యత, చేపడుతున్న నిర్మాణ విధానాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి పనిని ప్రణాళికాబద్ధంగా, నాణ్యతకు ఎలాంటి రాజీ లేకుండా చేపట్టాలని సూచించారు.
ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందేలా పనులను వేగవంతం చేయడంతో పాటు, నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులకు ఆదేశించారు. పనుల అమలులో ఎలాంటి జాప్యం చోటుచేసుకోకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ, నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ పరిశీలనలో సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజ్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికుమార్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజ్‌కుమార్, కాంట్రాక్టర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
