Collector Chahat Bajpai Stree Nidhi Loan Recovery
అకేరు న్యూస్ హనుమకొండ: స్త్రీ నిధి రుణాల వసూలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఏపీఎంలు, సీసీలు, స్త్రీ నిధి సిబ్బందిని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు.
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో స్త్రీ నిధి రుణాల మంజూరు, రుణ వసూళ్లు, బ్యాంక్ అనుసంధానంపై డీఆర్డీవో మేన శ్రీను, అడిషనల్ డీఆర్డీవో వెంకటేశ్వర్లు, రీజినల్ మేనేజర్, డీపీఎంలు, ఏపీఎంలతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్త్రీ నిధి రుణాల వసూలు మన స్త్రీ నిధి యాప్ ద్వారా మాత్రమే చెల్లించాలని ఆదేశించారు. అర్హులైన వారికి రుణాల మంజూరులో ప్రగతి సాధించాలని అన్నారు. స్త్రీ నిధులను దుర్వినియోగం చేసిన వీవోఏలపైన రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా రికవరీ చేయించాలన్నారు.
ఈ సమావేశంలో డీపీఎంలు అనిత, రాజేంద్ర ప్రసాద్, ఆర్ఎం రమేష్, ఏపీఎంలు, స్త్రీ నిధి సిబ్బంది పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
